ఎన్టీఆర్ తో.. ఆమెకు బంపరాఫర్

29
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ గా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి బాగానే గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో జోడి కట్టాలంటే హీరోయిన్స్‌కి అదృష్టముండాలి. అందుకే, ఆయనతో ఛాన్స్ కోసం చాలామంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడొక హీరోయిన్ లక్కీగా ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసింది అనే టాక్ మొదలైంది. ప్రేమలు చిత్రంతో తెలుగులోకి సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది మమితా బైజు.

అమ్మడికి యాక్టింగ్ బాగా వచ్చు. పైగా మమితా బైజు మంచి డ్యాన్సర్ కూడా. భరతనాట్యం కూడా నేర్చుకుంది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ కి రెండో జోడీగా ఒక సౌత్ నటి కావాలి. పెద్దగా వయసు లేని పాత్ర అది. అందుకే, మమితా బైజుకి ఆ అదృష్టం పట్టుకుంది. మరి వార్ 2తో పాన్ ఇండియా ప్రేక్షకుల గుండెల్లో కూడా గుడి కట్టించుకుంటుందేమో ఈ భామ. మమితా బైజుకి ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో ఛాన్స్ దొరికడం నిజంగా షాకింగే.

అయితే, జూ.ఎన్టీఆర్.. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమా చేయబోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలో మమితా బైజు లాంటి చిన్న హీరోయిన్ ను ఎందుకు తీసుకుంటారు ? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మమితా బైజు అయితే ఎన్టీఆర్ సరసన బావుంటుందని దర్శకుడు అయాన్ ముఖర్జీ అనుకుంటున్నాడట. పైగా ఈ జోడి కూడా ఫ్రెష్‌గా ఉంటుంది అని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియా టాక్.

Also Read:Anand:గం..గం..గణేశా..అప్‌డేట్

- Advertisement -