మన ఆరోగ్య సంరక్షణలో వ్యాయామం ఎంతో ముఖ్యమైనది. వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎలాంటి మెడిసిన్ లేకుండా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. అధిక బరువు, కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, బద్ధకం, బలహీనత,.. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలను కేవలం వ్యాయామం ద్వారానే అధిగమించవచ్చు. అందుకే మన జీవన శైలిలో వ్యాయామానికి తప్పనిసరిగా సమయం కేటాయించాలి. అయితే కొందరు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే.. మరికొందరు వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంటారు. వారంలో ఎలాంటి గ్యాప్ లేకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
* ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీర అవయవాలన్నీ యాక్టివ్ గా మారి.. అన్నీ భాగాలకు ఆక్సిజన్ సమృద్దిగా అందుతుంది.
* సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్.. ఇలా ఏది చేసిన ఆరోగ్యానికి మంచిదే. వీటి వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
* ప్రతిరోజూ వ్యాయామం చేస్తే శరీరంలో పెరుకుపోయిన కొవ్వు వేగంగా కరగడంతో పాటు కొత్తగా కొవ్వు ఏర్పడే అవకాశం ఉండదు. తద్వారా గుండె జబ్బులు, శ్వాస సంబంధిత సమస్యలు దరిచేరవు.
* ఇంకా ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంతే కాకుండా ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
* ప్రతిరోజూ వ్యాయామం చేస్తే నిద్రలేమి సమస్య ఉండదు, అలాగే జీర్ణ వ్యవస్థ కూడా బలపడుతుంది. కండర శక్తి పెరుగుతుంది.
ఇలా ఎన్నో ఉపయోగాలు ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కలుగుతాయని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.
Also Read:టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ దూరం?