మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించే బలవర్థకమైన పదార్థాలలో రాగులు మొదటి స్థానంలో ఉంటాయి. రాగులతో, రాగి ముద్ద, రాగి రొట్టె, రాగి జావ వంటివి చేసుకొని తింటూ ఉంటారు. వీటిలో అందరూ ఎంతో ఇష్టంగా తినేది రాగి జావ. చాలమందికి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం రాగి జావ సేవించే అలవాటు ఉంటుంది. ఇలా ప్రతిరోజూ దీనిని సేవించడం వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి. అయితే కొంతమంది వేసవిలో రాగిజావాను తాగడానికి ఇష్టపడరు. ఎందుకంటే వేసవిలో దీనిని సేవిస్తే శరీరంలో మరింత వేడి పెరుగుతుందని, తద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతాయనే అపోహ చాలమందిలో ఉంది.
నిజానికి సీజన్ తో సంబంధం లేకుండా రాగి జావ సేవించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే వేసవిలో డీహైడ్రేషన్ బారినుంచి రక్షించడంలో రాగి జావ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నా మాట. రాగులలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో రిబోఫ్లావిన్, నియాసిన్, వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరచడంలో సహాయ పడతాయట. రోజంతా ఎండలో పని చేసే వారు సాయంత్రం ఒక గ్లాస్ రాగి జావ తాగితే శరీరం హైడ్రేట్ గా మరి తక్షణ శక్తి లభిస్తుంది.
ఇంకా ఇందులో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను, బలపరుస్తుంది, ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మూత్రపిండాల పని తీరును మెరుగు పరుస్తాయట. తద్వారా వేసవిలో వచ్చే మూత్ర సమస్యలను ఈజీగా ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా షుగర్ వ్యాధిగ్రస్తులకు రాగి జావ చేసే మేలు గురించి ఎంత చెప్పిన తక్కువే. రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఇది ఒక మెడిసన్ ల పని చేస్తుందట. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ, జీర్ణ వ్యవస్థను వృద్ధి చేయడంలోనూ ఇది ఎంతో ప్రయోజనాకారి. కాబట్టి వేసవిలో కూడా రాగిజావాను నిరభ్యంతరంగా సేవించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:గంగా ఎంటర్టైన్మెంట్స్..’శివం భజే’