ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మద్య పొత్తు ఒకే అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై దృష్టి సారిస్తున్నారు అధినేతలు. అయితే ఇన్నాళ్ళు టీడీపీతో కలవడంపై ససేమిరా అన్న కాషాయ పార్టీ సరిగ్గా ఎన్నికల ముందు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఇంత సడన్ గా బీజేపీ ఎందుకు యూ టర్న్ తీసుకుంది ? దీని వెనక ఉన్న ప్లానేంటి ? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు 400 సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఆందుకే ప్రతి రాష్ట్రంలోనూ మెజారిటీ స్థానాలను సొంతం చేసుకోవడం చాలా మంఖ్యం. పైగా ఏపీలో ఏ మాత్రం బలం లేని బిజెపి సింగిల్ గా బరిలోకి దిగితే కనీసం ఒక సీటు కూడా సొంతం చేసుకోలేని పరిస్థితి. .
అందుకే పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో టీడీపీ వైఖరి కారణంగా రాష్ట్రంలో బీజేపీకి గట్టిగానే ఎదురు దెబ్బ తాకింది. ఆ కారణం చేత బాబుతో కలిసేందుకు సంకోచిస్తూ వచ్చింది కాషాయ పార్టీ.. కానీ ఈసారి ఎన్నికలు టీడీపీకి కూడా కీలకం కావడంతో బీజేపీ అవసరత ఆ పార్టీకి చాలానే ఉంది. అందుకే టీడీపీనే ఒక మెట్టు దిగి మళ్ళీ ఎన్డీయే గూటికి చేరింది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దాంతో ఎన్నికల్లో కనీసం రెండేసి సీట్లలో గెలుపొందిన ఏపీలో బీజేపీ పుంజుకున్నట్లే.. అందుకే కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఏపీలో బేస్ సంపాధించుకునేందుకే పొత్తులో భాగమైనట్లు తెలుస్తోంది. ఇకపై కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీల అధినేతలు ఉమ్మడిగా కలిసి ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నేతలు కూడా ప్రచారల్లో పాల్గొంటే.. కూటమిలో కమలం పార్టీకే ఎక్కువ మైలేజ్ పెరుగుతుందనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఫలితంగా ఇటు రాష్ట్రంలో బలపడడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల ముందు అనుకూల పవనాలు విస్తాయనేది బీజేపీ అధినాయకుల వ్యూహం. మరి మూడోసారి పీఎం సీటు పై కన్నేసిన నరేంద్ర మోడీకి ఈ రకమైన వ్యూహాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.
Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!