ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన సిఎం గా ఉన్నప్పుడూ అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడినట్లు గత కొన్నాళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో దీనిపై చార్జ్ షీట్ కూడా దాఖలు కాగా తాజాగా దీనిపై సీఐడీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి భూముల విషయంలో దాదాపు రూ.4400 కోట్లు చంద్రబాబు స్కామ్ కు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాబునే ప్రధాన ముద్దాయిగా సీబీఐ తెచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 1100 ఎకరాల్లో అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లు సీబీఐ చెబుతోంది. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల కాలంలో చంద్రబాబును వరుస స్కామ్ లు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
స్కిల్ స్కామ్, ఏపీ ఫైబర్ గ్రేడ్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్.. ఇలా చాలా స్కామ్ లే తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి. గత ఏడాది స్కిల్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా అసైన్డ్ భూముల విషయంలో స్కామ్ బయట పడడంతో బాబు మరోసారి జైలుకు వెళ్ళాల్సిందేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో స్కిల్ స్కామ్ విషయంలో కూడా సీబీఐ ఈ రకమైన ఆరోపణలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఆధారాలు లేకపోవడం వల్ల చంద్రబాబుకు ఆ స్కామ్ విషయంలో శాశ్వత బెయిల్ లభించింది. మరి ఇప్పుడు తెరపైకి వచ్చిన అసైన్డ్ భూముల స్కామ్ లో సీబీఐ పూర్తి ఆధారాలతో నిరూపణ చేయగలదా లేదా అనేది అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న. ఏది ఏమైనప్పటికి ఎన్నికల ముందు మరో స్కామ్ బయట పడడం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే అంశమే. మరి దీని విషయంలో ఆయన ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!