హీరోలతో పాటు అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకునే డైరెక్టర్ లు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు బోయపాటి శ్రీను. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి మార్క్ మర్చిపోలేనిది. కథలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతోపాటు.. తన సినిమాలో నటించే హీరో లేదా విలన్ కు అంతకుముందు వరకూ వారు కనిపించిన తీరుకు భిన్నమైన మేకోవర్ ఇచ్చి, మరింత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు బోయపాటి.
“భద్ర” మొదలుకొని “లెజండ్” వరకూ తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలోని కథానాయకుడి పాత్రతోపాటు వారి ఆహార్యాన్ని బోయపాటి తీర్చిదిద్దిన విధానమే అందుకు నిదర్శనం. ఆయన మునుపటి సినిమా “సరైనోడు”లోనూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా పిక్చరైజ్ చేసిన విధానానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. తెలుగు రాష్ట్రాలలో మాస్ సినిమా చెయ్యాలి అంటే అది ఆయనకే సాధ్యం.
ప్రధానంగా క్లాస్ ప్రేక్షకుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ను ‘సరైనోడు’లో ఊర మాస్ గా ప్రొజెక్ట్ చేసి ఆ వర్గం ప్రేక్షకుల్లో అతడికి ఫాలోయింగ్ పెంచిన ఘనత బోయపాటిదే. ఈ సినిమాతో బోయపాటి ఇమేజ్ మరింత పెరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో జట్టు కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు బోయపాటి.
అయినప్పటికీ ఈ సినిమాకు క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తుండటం విశేషం. ఈ సినిమా హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.7.2 కోట్ల ధర ఆఫర్ చేశాడట. సీడెడ్లో మామూలుగా స్టార్ల సినిమాలకు 8-9 కోట్ల మధ్య రేటు పలుకుతుంటుంది. ఆ లెక్కన చూస్తే బెల్లంకొండ సినిమాకు భారీ రేటు వచ్చినట్లే. ఇదంతా బోయపాటి ఘనతే అనడంలో సందేహం లేదు.