యాదాద్రి,భద్రాద్రిలో సీఎం ప్రత్యేక పూజలు

27
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ యాదాద్రి శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని,భద్రాద్రి సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు. తొలుత యాదాద్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రికి సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి రాగా స్వామివారికి ప‌ట్టువ‌స్త్రాలు, అమ్మ‌వారికి ముత్యాల తలంబ్రాలు స‌మ‌ర్పించారు.

అనంతరం భద్రాద్రి చేరుకున్న సీఎం..సీతారామ చంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయాల సందర్శన చేశారు రేవంత్ రెడ్డి. సీఎం వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, కొండా సురేఖ, ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నారు.

Also Read:Teeth Pain:పంటి నొప్పికి ఇంటి వైద్యం

- Advertisement -