Jagan:జగన్ కు భారీ ఓటమి తప్పదా?

28
- Advertisement -

ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి విజయభేరి మోగించిన వైసీపీ.. ఈసారి అంతకు మించి అనేలా 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా టార్గెట్ పెట్టుకుంది. అయితే క్లీన్ స్వీప్ సంగతి అటుంచితే కనీసం మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం లోకి వచ్చేనా ? అనే ప్రశ్నలే అధికంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు విన్నింగ్ పై వైఎస్ జగన్ కాన్ఫిడెంట్ గానే ఉన్నప్పటికి రియాలిటీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఐదేళ్లలో సంక్షేమం పేరుతో డబ్బు పంచడం తప్పా జగన్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పైగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు, నిత్యావసర ధరల పెంపు, ఇసుక కుంభకోణం.. ఇలా చాలా అంశాలపైనే ప్రజా వ్యతిరేకత నెలకొంది..

పైగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడం, పోలవరం పూర్తి చేయలేకపోవడం.. వంటివి కూడా ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి ఈసారి జరిగే ఎన్నికల్లో భారీ ఓటమి తప్పదని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ జాతీయ మీడియాలో వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం వెనుక ప్రశాంత్ కిషోర్ వ్యూహలే ముఖ్య పాత్ర పోషించాయి. కానీ ఈసారి ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించడం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే పీకే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తగా లేరని వైసీపీ వర్గం చెబుతోంది. ఇక ఇప్పటివరకు బయటకు వస్తున్న సర్వేలలో కూడా కొన్ని జగన్ కు ప్రతికూల ఫలితాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను బట్టి చూస్తే వైసీపీకి భారీ ఓటమి తప్పదేమో అనే అభిప్రాయాలూ చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. మరి జగన్ పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Also Read:బీజేపీతో దోస్తీ.. రేవంత్ బయట పెట్టారా?

- Advertisement -