కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వాతావరణానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని రాకను 4 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తున్నారు.
ఎన్టీపీసీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ 1600 మెగావాట్లకు పరిమితిమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రోకు, మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, ఎంపీ సోయం బాపు రావు, ఎమ్మెల్యే పాయం శంకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి,తదితరులు పాల్గొన్నారు.
Also Read:USA:ట్రంప్‌పై నిక్కీ హేలీ గెలుపు