ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి!

40
- Advertisement -

 మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరం ఫిట్ గా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఆరోగ్య సంరక్షణను పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే చాలామందికి ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి వీలుపడదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించడం ద్వారా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా !

ప్రతిరోజూ నిద్ర లేవగానే పడగడుపున గోరు వెచ్చని నీరు త్రాగితే శరీరం హైడ్రేట్ గా మారుతుంది. అంతే కాకుండా శరీరమంతాటికి రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ఇంకా ఈ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే బద్దకం దూరమై శరీరం ఫిట్ గా మారుతుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయలేని వారికి యోగా మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో యోగా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. చాలమంది తీపి పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. చక్కెర తో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. .

కాబట్టి వీలైనంత వరకు చక్కెర పదార్థాలుకు దూరంగా ఉంటే వేగంగా ఫిట్నెస్ సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫిట్ గా ఉండాలనుకునే వారు ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఇష్టమైన రుచికరమైన ఆహారం విషయంలో నోటిని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెంచే జంక్ ఫుడ్, బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్.. వంటివాటిని మితంగా తీసుకోవాలి. వాటికి బదులు పండ్లు, ఫ్రూట్ సలాడ్ లు వంటివి సేవించడం మంచిది. పై సలహాలు పాటిస్తూనే నడకపై దృష్టి సారించాలి. ఎందుకంటే ప్రతిరోజూ కనీసం ఒక అరగంట నడక శరీరం ఫిట్ గా ఉండేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి ఫిట్ నెస్ పై దృష్టి సారించేవారు పై సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే ఫిట్నెస్ వేగంగా సాధించవచ్చు.

Also Read:సొరకాయ రసంతో..ఇన్ఫెక్షన్స్ కు చెక్!

- Advertisement -