గుడ్డును పోషకాల నిలయంగా పరిగణిస్తుంటారు. ఎందుకంటే మన శరీరానికి అవసరమైన అన్నీ రకాల పోషకాలు గుడ్డులో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, పీచు పదార్థం మినహా మిగిలిన అన్నీ రకాల విటమిన్లు, ప్రోటీన్లు, పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే గుడ్డులోని తెల్లసోనతో పోల్చితే పచ్చసోన తినడానికి చాలమంది విముఖత చూపుతుంటారు. ఎందుకంటే పచ్చసొనలో నీసు వాసన అధికంగా ఉండడంతో చాలమంది అలెర్జీ గా భావించి దానిని తినడానికి ఆసక్తి చూపరు. అంతేకాకుండా పచ్చసొన తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే భయంతో కూడా చాలమంది దానిని పక్కన పెట్టేస్తుంటారు. అయితే పచ్చసొనలో కూడా తెల్లసొనతో సమానమైన పోషకాలు ఉంటాయని, దానిని కూడా తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .
తెల్లసోనలో ప్రోటీన్లు, రైబోఫ్లేమిన్లు, పొటాషియం, సల్ఫర్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇక పచ్చసోనలో విటమిన్ ఏ, డి, ఇ.. వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి రెండిటినీ మిలితంగా తీసుకుంటేనే గుడ్డులోని పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె పనితీరును మెరుగు పరిచే ఒమేగా3 ఫ్యాటియాసిడ్స్ పచ్చసోనలో ఉంటాయట. కాబట్టి పచ్చసొన తినడం గుండెకు ఎంతో మంచిది. ఇంకా పచ్చసొన శరీరంలో మంచి మంచి కొవ్వును పెంచే పోషకాలు ఉంటాయి. జంక్ ఫుడ్ లో ఉండే కొలెస్ట్రాల్ తో పోల్చితే పచ్చసోనలో కొలెస్ట్రాల్ శాతం తక్కువే కాబట్టి పచ్చసొన నిరభ్యంతరంగా తినవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇంకా బరువు తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా పచ్చసొన తింటే త్వరగా శరీర బరువును పెంచడంలో సహాయ పడుతుందట. కాబట్టి పచ్చసొన తినడంపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా నిరభ్యంతరంగా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతున్న మాట.
Also Read:రాబిన్ హుడ్‌తో శ్రీలీల రొమాన్స్!