ఐదో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే !

34
- Advertisement -

భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే నాలుగు టెస్టు మ్యాచ్ లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. ఆ తర్వాత వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లలో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది టీమిండియా. దాంతో ఈ నెల 7 నుంచి ప్రారంభం అయ్యే చివరి టెస్టు మ్యాచ్ నామమాత్రంగా జరగనుంది. అయితే చివరి టెస్టులో కూడా విజయం సాధించి రికార్డు క్రియేట్ చేయాలని టీమిండియా భావిస్తుంటే.. పరువు నిలుపుకునేందుకు ఇంగ్లాండ్ ఆరాటపడుతోంది. ఇక ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో చివరి టెస్టు మ్యాచ్ లో మార్పులు ఉంటాయనే టాక్ క్రీడా వర్గాల్లో వినిపించింది.

మొదటి మ్యాచ్ నుంచి విరామం లేకుండా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపించింది. అలాగే చివరి టెస్టు మ్యాచ్ కు కే‌ఎల్ రాహుల్ ఎంట్రీ ఇస్తాడని వార్తలు కూడా గట్టిగానే వచ్చాయి. అలాంటి వార్తలన్నిటికి చెక్ పెడుతూ ప్లేయర్ల జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది బీసీసీఐ. చివరి టెస్టులో కూడా రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని కన్ఫర్మ్ చేసింది. నాలుగో టెస్టులో సత్తా చాటిన ఆటగాళ్లనే చివరి టెస్టులో కూడా కొనసాగించనుంది. ఇక ఐదో టెస్టు మ్యాచ్ అశ్విన్ కు వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. చివరి టెస్టులో ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్ల ఆటగాళ్లు స్వేచ్చగా అతను ఆస్వాదించే అవకాశం ఉంది. జైస్వాల్, జూరెల్, సర్ఫరాజ్ వంటి యంగ్ ప్లేయర్స్ అద్బుతంగా రాణిస్తున్నారు. చివరి టెస్టులో వీరు మరింత చెలరేగే అవకాశం ఉంది. మరి ఇప్పటికే సిరీస్ సొంత చేసుకున్న టీమిండియా ఐదో టెస్టులో కూడా విజయం సాధించి సత్తా చాటుతుందేమో చూడాలి.

తుది జట్టు ; రోహిత్ శర్మ ( కెప్టెన్ ), జైస్వాల్, గిల్, పాటీదార్, సర్ఫరాజ్, ధృవ్ జూరెల్, భరత్, పడిక్కల్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్, బుమ్రా, ముఖేష్, ఆకాష్ దీప్

Also Read:తల్లి కాబోతున్న దీపికా.. కానీ ?

- Advertisement -