ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటున్నారా..!

32
- Advertisement -

నేటి రోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డారు. మధ్యాహ్న సమయంలో కూడా భోజనానికి బదులు ఫాస్ట్ ఫుడ్ నే ఎక్కువగా తింటూ ఉంటారు. గోబి, ఫ్రైడ్ రైస్, నూడుల్స్.. ఇలా రకరకాల ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభిస్తుంటాయి. ఇవి అమోఘమైన రుచిని కలిగి ఉండడంతో పాటు ధర తక్కువ కావడంతో ఫాస్ట్ ఫుడ్ తినడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. అయితే తరచూ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ లో మసాలా ఎక్కువగా ఉంటుంది అంతే కాకుండా ట్రాన్స్ ఫ్యాట్ కూడా అధికంగా ఉంటుంది. వీటి కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కడుపులో మంట, ఎసిడిటీ, వంటివి పెరిగి జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది.

ఇంకా ఫాస్ట్ ఫుడ్ లో అధిక క్యాలరీలతో పాటు చక్కెర కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల యూరినరి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇందులో ఉండే సంతృప్త కొవ్వుల కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందట. తద్వారా వేగంగా బరువు పెరిగి ఊబకాయానికి దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఫాస్ట్ ఫుడ్ తినే వారిలో కిడ్నీల పనితీరు కూడా మందగిస్తుందని నివేధికలు చెబుతున్నాయి. ఇంకా హైబీపీ, మధుమేహం.. ఇలా దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా సంభవించే అవకాశం ఉందట. కాబట్టి వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్ ను అవైడ్ చేయడం బెటర్ అని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ కు బదులుగా ఇంట్లో చేసిన రుచికరమైన భోజనం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’..

- Advertisement -