పులివెందులలో త్రిముఖ పోరు ఉండనుందా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నిన్న టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంతో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయబోతున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా పులివెందులలో జగన్ కు పోటీగా బిటెక్ రవి ని బరిలో దించబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఇక కాంగ్రెస్ తరుపున వైఎస్ షర్మిల కూడా జగన్ కూడా పోటీగా పులివెందుల నుంచే పోటీ చేయబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా షర్మిల పులివెందుల బరిలో నిలిస్తే.. జగన్ కు భారీ షాక్ తప్పదు. గత కొన్నేళ్లుగా పులివెందుల నియోజక వర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది. కానీ గత రెండేళ్ల కాలంలో వైఎస్ కుటుంబంలో అన్నచెల్లెళ్ళు అయిన జగన్ షర్మిల మద్య విభేదాలు చెలరేగుతూ వచ్చాయి.
ఈ విభేదాల కారణంగానే ఆమె ఏపీ రాజకీయాలు విడిచి తెలంగాణలో పార్టీ పెట్టారు. .అయితే మళ్ళీ ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాద్యతలో ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ పాలనపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ తరుపున జగన్ కు పోటీగా పులివెందుల నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గెలవడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమే. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబానికి అడ్డాగా ఉన్న పులివెందులనే ఆమె ఎంచుకునే అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ షర్మిల కూడా నిజంగానే పులివెందుల బరిలో నిలిస్తే పోటీ రవసత్తరంగా మారడం ఖాయం. అన్న చెల్లెళ్ల మధ్య జరిగే బిగ్ ఫైట్ లో ఓట్ల చీలిక బారిగా ఏర్పడే అవకాశం ఉంది. వీరిద్దరి మద్య ఫైట్ అటు టీడీపీ బీటెక్ రవికి ప్లెస్ అయిన ఆశ్చర్యం లేదనేది కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన పులివెందులలో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.
Also Read:‘కారు జోరు’ గ్యారంటీ !