‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై యూత్ హర్ట్‌ని దోచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రం “చందమామ రావే”. ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్‌గా నటిస్తుంది. ‘అది రాదు.. వీడు మారడు’ అనేది క్యాప్షన్. ఈ చిత్రాన్ని లైఫ్ కార్పొరేషన్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్ కార్పొరేషన్ ప్రోడక్షన్ నెం-1 గా నిర్మాతలు కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రక్తచరిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వర్మ సహా పలువురు స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కవల దర్శకులు ధర్మ-రక్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ… “ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన దర్శకులు ధర్మ, రక్షలు సినిమాను చక్కగా రూపొందించారు. ప్రపంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్రమే కావడం విశేషం. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పెక్యులర్ లవ్‌స్టోరీ. లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పేఎక్స్‌ట్రీమ్ లవ్‌స్టోరీ ‘చందమామ రావే’ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో రూపొందించిన పెక్యులర్ లవ్ స్టోరీ చందమామ రావే.
నవీన్‌చంద్ర పాత్ర చాలా ఆసక్తికరంగా, యూనిక్‌గా ఉంటుంది. మంచి ఎమోషన్స్‌తో సాగే చిత్రం. హీరో నవీన్‌చంద్ర పూర్తి సహకారాన్ని అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా హిమాలయాలు, గ్యాంగ్‌టక్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. దేవదాసుని పార్వతి ఒక్కసారి వదిలేస్తేనే ఆయన పరిస్థితి అలా తయారైతే.. ఒకే అమ్మాయి హీరోని మూడు సార్లు వదిలేస్తే ఇంకెలా ఉంటుందనేది సినిమా బేసిక్ కాన్సెప్ట్. ఆద్యంతం అలరించే చిత్రంగా రూపొందిన “చందమామ రావే”ను జూన్ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.