టీమిండియా భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 302 పరుగుల వద్ద నిలిచింది. జో రూట్ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టుకు మంచి స్కోర్ లభించింది. తొలి సెషన్ లో భారత బౌలర్లు సత్తా చాటినప్పటికి రెండో సెషన్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడుతూ ఆ మాత్రం స్కోర్ అందించారు. రూట్ ( 106 ), రాబిన్సన్ 31 పరుగులతో ప్రస్తుతం క్రీజ్ లో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో ఆకాష్ దీప్ ఆరంగేట్ర మ్యాచ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడు వికెట్లు తీసి ఇంగ్లీష్ జట్టు నడ్డి విరిచాడు. సిరాజ్ రెండు వికెట్లు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ తీసుకొని ఇంగ్లాండ్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
రోహిత్ సేన చేసిన తప్పు అదే
ప్రస్తుతం ఇంగ్లాండ్ 307 పరుగులతో పటిష్టంగా ఉంది. అయితే ఇంగ్లీష్ జట్టు ఈ స్థాయి స్కోరు సాధించడానికి కారణం టీమిండియా చేసిన కొన్ని పొరపాట్లే అని మాజీలు చెబుతున్నారు. కీలక సమయాల్లో రివ్యూలు కోల్పోవడం భారత్ ను దెబ్బ తీసిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. రోహిత్ శర్మ రివ్యూలు తీసుకోవడంలో తడబడ్డాని అందువల్లే ఇంగ్లాండ్ మంచి స్కోరు సాధించిందని మాజీ ఆటగాడు సినీల్ గవర్సర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా 60 ఓవర్లలోపే రివ్యూలన్ని కోల్పోవడం వల్ల సెండో సెషన్ లో వికెట్లు రాబట్టడంలో రోహిత్ సేన విఫలం అయింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టుకు భారీ స్కోరు దిశగా మార్గం సులువైంది. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న రూట్, రాబిన్సన్ చెలరేగితే టీమిండియాకు భారీ టార్గెట్ ఖాయం. మరి రోహిత్ సేన ఇంగ్లీష్ జట్టును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Also Read:లవ్ గురు… లిరికల్ సాంగ్