బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్, అతని తమ్ముడు సంపత్ గంజాయి కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విచారణలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘యూట్యూబ్‌లో ఛాన్స్ ఇప్పిస్తానని షణ్ముక్ మోసం చేశాడు. అతని సోదరుడు నన్ను విల్లాకు తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఓ సారి అబార్షన్ కూడా చేయించాడు. సంపత్‌కు పెళ్లి అయిందని తెలిసి ఫిర్యాదు చేశా’ అని మౌనిక అనే యువతి వాపోయారు. మొత్తానికి బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ బ్రదర్స్‌పై నమోదైన కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి.
తాజాగా ఈ కేసుపై ఏసీపీ స్పందించారు. సంపత్ కోసం వెళితే, షణ్ముఖ్ నివాసంలో గంజాయి, మత్తు పదార్థాలు లభించాయని తెలిపారు. ఈ మేరకు సంపత్‌పై చీటింగ్, రేప్ కేసులు కూడా నమోదు చేశామని పేర్కొన్నారు. ఇక గంజాయి విషయంలో షణ్ముఖ్ పాత్రపై విచారిస్తున్నామన్నారు. సంపత్ ఫ్లాట్‌లో 16 గ్రాముల గంజాయిని సీజ్ చేశామని వెల్లడించారు. అయితే, షణ్ముఖ్ గతంలో కూడా ఇలాంటి కేసులో నుంచి జస్ట్ బయట పడ్డాడు అని, కానీ.. ఆ సమయంలో ఓ పెద్ద వ్యక్తి సాయం వల్ల అప్పుడు ఆ కేసు నుంచి షణ్ముఖ్ బయట పడ్డాడు అని, కానీ ప్రస్తుతం పాపం పండి, ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజంగానే గంజాయి కేసులో షణ్ముక్ పాత్ర ఉందా ?, గతంలో కూడా అతను డ్రగ్స్ తీసుకున్నాడా? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రముఖ యూట్యూబర్ గా, బిగ్‌బాస్ 5 రన్నరప్ గా షణ్ముక్ జస్వంత్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు వచ్చిన క్రేజ్ ను వాడుకుంటూ.. షణ్ముక్ జస్వంత్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరోగా కూడా నటిస్తున్నాడు. కానీ, షణ్ముక్ జస్వంత్ ను సడెన్ గా పోలీసులు అరెస్టు చేయడంతో ఇప్పుడు ఆ సినిమా టీమ్ ఆందోళనలో ఉంది. షణ్ముక్ జస్వంత్ తో పాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని బలమైన కేసులను నమోదు చేశారు. ఇంతకీ షణ్ముక్ పరిస్తితి ఏమిటి అనేది కొన్ని రోజులు ఆగితే గానీ తేలదు.
Also Read:కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి..కేసీఆర్ సంతాపం