లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ నివాళి..

32
- Advertisement -

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి మాజీ సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న సీఎం..కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాస్య నందిత పార్దివదేహంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాస్య నందిత ఆకస్మిక మరణం చాలా బాధాకరం అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను అని తెలిపారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతది అనుకోలేదన్నారు.

ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న లాస్య మరణ వార్త నన్ను ఎంతో కలచి వేసిందని..తండ్రి సాయన్న మరణం నుండి కోలుకోక ముందే ఈ విధంగా జరగడం చాలా బాధాకరం అన్నారు.

Also Read:ఆ రెండు గ్యారెంటీలు..ఎప్పటినుంచి అంటే?

- Advertisement -