Sree Leela:ఆ దర్శకుడికి హ్యాండ్ ఇచ్చింది

26
- Advertisement -

‘హీరోయిన్ శ్రీలీల’ పై ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. అది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో శ్రీలీల తీరు పై ఈ వార్త. హీరోయిన్ అన్న తర్వాత డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో మనం పరిచయం చేసిన హీరోయిన్, మనం లిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ అలాగే అక్కడే వుండిపోదు. డిమాండ్ పెరుగుతుంది. రెమ్యూనిరేషన్ పెరుగుతుంది. ఇక్కడ మొహమాటాలు వుండవు. ఇవన్నీ రాఘవేంద్రరావుకి తెలియనివి కావు. కానీ ఎందుకో ఆయన ఓ యాడ్ తీయాలి అనుకున్నారు.

తన స్నేహితుడి కంపెనీకి ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా రాఘవేంద్రరావు ఆ యాడ్ తీస్తున్నారు. సో.. శ్రీలీలతో యాడ్ చేయాలి అని ప్లాన్ చేశారు. కానీ, శ్రీలీల రెమ్యూనరేషన్ భారీగా అడిగింది. సహజంగా స్టార్ డమ్ వచ్చాక, రేంజ్ పెరుగుతుంది. కానీ, ఇది పరిగణనలోకి తీసుకోక రాఘవేంద్రరావు మాత్రం కాస్త అసహనంగా ఫీలవుతున్నారని తెలుస్తోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ పెళ్లి సందడితో పేరు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు ఇలా డిమాండ్ చేయడం ఆయన మనసును బాధ పెట్టింది.

నిజానికి బుట్టబొమ్మలాంటి హీరొయిన్ అంటూ మొదటి నుంచి శ్రీలీలను బాగా ఎంకరేజ్ చేశారు రాఘవేంద్రరావు. శ్రీలీల కూడా బాగానే సినిమా సినిమాకు స్థాయి పెంచుకుంటూ మంచి పొజిషన్ కు చేరుకుంది. కొత్త నీరు వచ్చినా చేతిలో ఒకటో రెండో సినిమాలు వున్నాయి కానీ ఖాళీగా అయితే లేదు. ఇలాంటి టైమ్ లో రాఘవేంద్రరావు తన యాడ్ లో చేయమని అడిగారు. కానీ ఆమె మాత్రం పట్టించుకోలేదు.

Also Read:ఎంత తిన్న సన్నగానే ఉన్నారా?

- Advertisement -