Devara:దేవర..అసలేం జరుగుతోంది?

23
- Advertisement -

దసరాకి రాబోతున్న పెద్ద సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ భలే గమ్మత్తుగా డిస్కస్ చేసుకుంటోంది. ఒకటి భారీ సినిమా. పైగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా. కాబట్టి, దేవర సినిమాకి అటు ఇటు సినిమాలు వేయకుండా దూరంగా వుంటేనే మంచిది. పైగా కొరటాల శివ దర్శకుడు. అందువల్ల ఓపెనింగ్ మామూలుగా వుండదు. హిట్ అయితే ఎక్కడో వుంటుంది దేవర సినిమా.. ఇదీ ఒక రకం డిస్కషన్ అయితే, మరోరకం డిస్కషన్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి, కాంతారా లాంటి సినిమాలు తక్కువ కమిషన్ మీద అస్సలు పెద్దగా అడ్వాన్స్ లు కూడా తీసుకోకుండా నేరుగా విడుదల చేసుకుని, లాభాలు తిన్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర పార్ట్ 1ను ఎలాగైనా నాన్ రిటర్న్ అడ్వాన్స్ ల మీద అమ్మేయాలని అనుకుంటున్నారు. ఆంధ్ర నుంచి 100 కోట్లు వస్తాయని అంచనా వేసిన వాళ్లు, అలా రాకుంటే 75 కు ఎందుకు తగ్గిపోతున్నారు ?, రేటు తగ్గుతున్నా కూడా బయ్యర్లు ఎందుకు ధైర్యంగా ముందుకు రావడం లేదు. ఇది రెండో రకం డిస్కషన్. మొత్తానికి దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వెంటనే అనేక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదిలా వుంటే కొన్ని గ్యాసిప్ లు కూడా దేవర మీద వినిపిస్తున్నాయి.

హీరో ఎన్టీఆర్ ఆ సినిమా దర్శకుడు కొరటాల శివకు, నిర్మాతలకు మధ్య పొరపొచ్చాలు వచ్చాయన్నది ఆ గుసగుసల సారాంశం. సినిమా కంటెంట్ క్వాలిటీ మీద ఎన్టీఆర్ సంతృప్తిగా లేరని టాక్. అలాగే విడుదల డేట్ మీద కూడా ఎన్టీఆర్ అయిష్టంగా వున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో సరైన డేట్ కాదని ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడట. సమ్మర్ లో రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అని తారక్ ఫీల్ అవుతున్నాడు. మొత్తానికి ‘దేవర’ రిలీజ్ విషయంలో అసలేం జరుగుతుంది ? అనేది క్లారిటీ లేకుండా ఉంది. కానీ, ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్టర్ అయితే బయటకు వచ్చేసింది.

Also Read:కాళేశ్వరం పక్కన పెట్టేందుకే ప్లాన్?

- Advertisement -