టీ20 వరల్డ్ కప్ కెప్టెన్ ‘రోహిత్ శర్మ’నే..!

26
- Advertisement -

ఈ ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి టీ20 వరల్డ్ కప్ సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలగా ఉంది. 2007 ధోనీ సారథ్యంలో టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఇంతవరకు కప్ సాధించలేదు. అత్యుత్తమ జట్టుగా పేరు గాంచినప్పటికి టీమిండియాకు గత కొన్నాళ్లుగా వరల్డ్ కప్ అందని ద్రాక్షలాగే మారింది. 2022 లో జరిగిన వరల్డ్ కప్ లో సెమీస్ నుంచి నిష్క్రమించింది టీమిండియా. లీగ్ దశలో అదరగొడుతున్నప్పటికి సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లలో చేతులెత్తేస్తోంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లోనూ ఫైనల్ లో ఓటమి చవిచూసింది. దీంతో ఉరిస్తూ చేజారిపోతున్న వరల్డ్ కప్ అందుకోవాలని టీమిండియా ఈసారి గట్టి పట్టుదలగానే ఉంది. అందుకే టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి సారిస్తున్నారు సెలెక్టర్లు.

ప్రస్తుతం యువ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు కెప్టెన్ విషయంలోనే కన్ఫ్యూజన్ నడుస్తూ వచ్చింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా కొనసాగుతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమౌతువచ్చాయి. ఎందుకంటే 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే వరల్డ్ కప్ రోహిత్ కెప్టెన్సీ లోనే మిస్ అయ్యాయి. దాంతో రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే వార్తలు బాగానే వినిపించాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు కూడా రోహిత్ శర్మనే కెప్టెన్ గా ఉంటాడని స్పష్టం చేశాడు. దీంతో రోహిత్ కెప్టెన్సీ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడినట్లైంది. ఈ సారి వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జట్టులో సీనియర్ ఆటగాళ్లుగా ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు. మరి ఈ సీనియర్ ఆటగాళ్లు ఇండియాకు వరల్డ్ కప్ అందిస్తారో లేదో చూడాలి.

Also Read:గోంగూర ఎక్కువగా తింటున్నారా?

- Advertisement -