నెలసరికి ముందు ఇవి తినండి!

19
- Advertisement -

ఆడవారిలో నెలసరి సాధారణ సమస్యే అయినప్పటికి.. ఆ టైమ్ లో వచ్చే ఆరోగ్య మార్పులు అన్నీ ఇన్నీ కావు. నీరసం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, కళ్ళు తిరగడం, చిరాకు.. ఇలా చాలా సమస్యలే వారిని చుట్టూ మూడతాయి. బ్లేడ్ తక్కువగా ఉన్నవారిని ఈ సమస్యలు మరింత ఎక్కువగా వేధిస్తాయి. అందుకే నెలసరి టైమ్ లో మహిళలు ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే నెలసరి సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందేందుకు నెలసరి వచ్చే ముందు రోజు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్యల నుంచి కొంతైనా విముక్తి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెలసరిలో వచ్చే ఆరోగ్య సమస్యలకు మెడిసిన్ కంటే కూడా ఇంటి చిట్కాలు అద్బుతంగా పని చేస్తాయి.

అవేంటో చూద్దాం !

నెలసరి సమయంలో బ్లడ్ బయటకు పోవడం వల్ల నీరసంగా, బలహీనంగా మారతారు. కాబట్టి ఆ టైమ్ లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరా వంటి వాటిని తినడం వల్ల అందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తద్వారా రక్తం వేగంగా వృద్ధి చెందుతుంది. నెలసరి సమయంలో సాధారణంగానే కడుపు నొప్పి వస్తుంది. ఆ టైమ్ లో మలబద్ధకం ఉంటే కడుపు నొప్పి మరింత పెరుగుతుంది.

అందువల్ల మలబద్ధకం రాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే వేరుశనగ, జీడిపప్పు, బెల్లం వంటి వాటిని తినాలి. ఇక నెలసరి సమయంలో జంక్ ఫుడ్స్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. తినే ఆహారంలో అలసందలు, పెసలు వంటివి ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఇంకా నెలసరి సమయంలో కూల్ డ్రింక్స్, టీ, కాఫీ.. వంటివాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటూ లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవిస్తూ ఉండాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:పంపర పనస పండు..ప్రయోజనాలు!

- Advertisement -