Raviteja:రవితేజ హిట్ ట్రాక్ ఎక్కేనా?

21
- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా అద్బుతమైన హిట్స్ అందుకున్నాడు. యూత్, ఫ్యామిలీ, మాస్.. ఇలా ప్రతి ఆడియన్స్ కూడా రవితేజ సినిమాల కోసం వెయిట్ చేస్తుంటారు. పక్కా ఎంటర్టైన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన మాస్ మహారాజ్ సినిమాలు గత కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోతున్నాయి. 2011లో వచ్చిన మిరపకాయ్ మూవీ తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేదు మాస్ మహారాజ్. మద్యలో బలుపు, ధమాకా వంటి సినిమాలతో హిట్ కొట్టినప్పటికి అవి జస్ట్ యావరేజ్ గానే నిలిచాయి. ఇక ఎన్నో అంచనాల మద్య గత ఏడాది విడుదల అయిన టైగర్ నాగేశ్వర్ రావు కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ.

మూవీపై డివైడ్ టాక్ వచ్చినప్పటికి పోటీలో ఎలాంటి సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతోంది. ఒకవేళ పోటీలో ఏదైనా మూవీ ఉండి ఉంటే ఈగల్ కూడా ఫ్లాప్ గానే నిలిచేదని కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ చూసి దాదాపు 13 ఏళ్ళు అయిందనే చెప్పాలి. ప్రస్తుతం కథ నేపథ్యం ఉన్న మూవీస్ ను ప్రేక్షకులు అదరిస్తున్న సమయంలో రవితేజ రొటీన్ మాస్ మూవీస్ చేస్తుండడంతో ఆయన మూవీస్ ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయనేది కొందరు చెప్పే మాట.

ప్రస్తుతం స్టార్ హీరోస్ అందరూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటూనే డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రవితేజ కూడా ఆ విధంగా విభిన్నమైన కథలు ఎంచుకుంటే హిట్ స్టేటస్ లభిస్తుందనేది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ” మిస్టర్ బచ్చన్ ” అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కూడా రొటీన్ మాస్ మసాలాగా నే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రవితేజ కు మరో ఫ్లాప్ రానుందా అనే సందేహాలు ఆయన అభిమానుల్లో మెదులుతున్నాయి. అయితే గతంలో మిరపకాయ్ వంటి హిట్ మూవీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై బాగానే హైప్ ఉంది. మరి మిస్టర్ బచ్చన్ మూవీతోనైనా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read:TTD:అర్ధ‌ బ్రహ్మోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

- Advertisement -