Telangana Budget:రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్

29
- Advertisement -

రూ.2.75 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25ను ప్రవేశ పెట్టారు భట్టి.అందరం కోసం మనమందరం అనే స్పూర్తితో ముందుకెళ్తున్నాం అన్నారు. సమానత్వమే మా ధ్యేయం అని…తెలంగాణ సమాజం మార్పును కోరుకుంది అన్నారు.

ఆరు గ్యారంటీల అమలకు 53,196 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. వైద్యరంగానికి రూ.11,500 కోట్లు, గృహ నిర్మణానికి రూ.7,540 కోట్లు ,మూసి ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు కేటాయించారు. గురుకులాల భవనాల కోసం రూ.1500 కోట్లు, త్వరలో రుణమాఫీకి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 3500 ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ.500 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

Also Read:పాక్‌లో హంగ్..సైనిక జనరల్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -