కూల్ డ్రింక్స్ తాగితే.. క్యాన్సర్ వస్తుందా?

20
- Advertisement -

ఫిబ్రవరి పూర్తి కాకుండానే ఎండల తీవ్రత పెరిగింది. దీన్ని బట్టి ఈ ఏడాది భానుడి తాపం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎండాకాలంలో సేదతీరేందుకు ఎక్కువగా శీతల పానీయాలను సేవిస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే ఎండలో చల్లటి కూల్ డ్రింక్స్ తాగితే శరీరం చల్లబడడంతో పాటు ఎంతో రిలాక్స్ గా అనిపిస్తూ ఉంటుంది. అయితే శీతల పానీయాలను ఎక్కువగా సేవించడం ఆరోగ్యానికి హానికరమే అని చెబుతున్నారు నిపుణులు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే లివర్ క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉందట. అంతే కాకుండా హెపటైటిస్, ఊబకాయం వంటి ధీర్ఘకాలిక వ్యాధులు సంబంధించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి కూల్ డ్రింక్స్ లో శరీరానికి అవసరమయ్యే ఎలాంటి పోషకాలు ఉండవు. ఇంకా ఇందులో ఉండే రసాయనిక యాసిడ్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయట.

సాధారణంగా చాలా మంది బిర్యానీ, పిజ్జా వంటివి తినే సమయంలో కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. ఇలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదట. ఇలా తాగడం వల్ల గ్యాస్ ఏర్పడడమే కాకుండా లివర్ పని తీరు మందగించి క్యాన్సర్ కూడా దారి తీస్తుందట. ఇందులో ఉండే పాస్పోరిక్ యాసిడ్ ఎముకల పటుత్వాన్ని దెబ్బ తీస్తాయట. అంతే కాకుండా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళల్లో కూల్ డ్రింక్స్ ఎక్కువ ఆరోగ్య సమస్యలకు కారణమౌతాయని పరిశోదనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్రీలు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఇందులోని రసాయనిక యాసిడ్స్ గర్భస్రావానికి దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి యాసిడ్స్ తో కూడిన కూల్ డ్రింక్స్ కు బదులుగా పండ్ల రసాలను సేవించడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:Pawan:పవన్ ‘ వీరమల్లు ‘ సంగతేంటి?

- Advertisement -