మేడారం జాతర…గవర్నర్‌కు ఆహ్వానం

27
- Advertisement -

ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారంకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుండి 24 వరకు మేడారం జాతర జరగనుండగా ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు ఎలాంటి లోటు పాట్లు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ మేడారం జాతరకు రావాల్సిందిగా గవర్నర్ తమిళి సైని ఆహ్వానించారు మంత్రి సీతక్క. రాజ్ భవన్‌లో గవర్నర్‌ని కలిసి ఆహ్వానం అందించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ఈ జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా. రెండేళ్లకోసారి మాఘమాసంలో నాలుగు రోజులపాటు కన్నుల పండుగ్గా జరుగుతుంది ఈ గిరిజన జాతర. మేడారం అనగానే అందరికీ గుర్తొచ్చేది నిలువెత్తు ఎత్తు బంగారం మెుక్కులు.

Also Read:ఈగల్..అద్భుతమైన యాక్షన్ డ్రామా

- Advertisement -