ఈ మధ్య న్యూస్ ఛానల్స్‌లో లైవ్ జరుగుతుండగానే అవాక్కయ్యే సంఘటనలు జరుగుతున్నాయి. లైవ్ లో వార్తలు చదవడం మానేసి ఏదో ఆలోచిస్తూ కూర్చున్న ఘటన ఒకటయితే…పిల్లలు నేరుగా లైవ్‌లోకి వచ్చేసిన ఘటన మరోటి. ఇలా లైవ్ లోనే దొరికిపోతున్నారు. అయితే తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఈసారి మాత్రం ఏకంగా లైవ్ న్యూస్‌లోకి ఓ శునకం వచ్చేసింది.
లైవ్‌లో సీరియస్‌గా వార్తలు చదువుతుంటే కాళ్ల కింద ఏదో మెత్తగా తగలడంతో కిందికి చూసిన ఆమె షాక్‌కు గురైంది. అయినా వార్తలు చదువుతూనే పలుమార్లు కిందికి చూసి ఒక్కసారిగా అవాక్కయింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ శునకం ఆమె డెస్క్ కింద కదులుతుండడంతో మొదట షాక్ తిన్న ఆమె తర్వాత వార్తలు చదువుతూనే దాని తలపై చేయి వేసి ప్రేమగా నిమిరింది. దీంతో అదికాస్తా డెస్క్‌పైకి తొంగి చూసింది.
అయినా వార్తలు చదవడం ఆపలేదు ఆ యాంకర్. అయితే ఆ శునకం మాత్రం వెళ్లిపోకుండా టేబుల్ మీదకు ఎక్కి పేపర్లు తీసేందుకు ప్రయత్నించింది. దాదాపు 15 సెకన్ల పాటు శునకం లైవ్‌లో కన్పించింది. కానీ యాంకర్ మాత్రం వార్తలు చదువుతూనే ఉంది. రాష్యాలోని ఓ న్యూస్ చానల్‌లో ‘మాస్కో డిమాలిషన్’ గురించి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూస్ చానల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇప్పటికే లక్షలాదిమంది ఈ వీడియోను వీక్షించారు.
ఒక్కసారిగా లైవ్‌లోనే…యాంకర్ షాక్..!
- Advertisement -
- Advertisement -