ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చాలా రకాల కరెన్సీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కరెన్సీకి ఒక్కో విలువ ఉంటుంది. ఇతర దేశాల్లో ఆ కరెన్సీ డిమాండ్ ను బట్టి దాని విలువ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ ఏది అంటే చాలామంది డాలర్ అని భావిస్తారు. నిజానికి డాలర్ అనేది అంతర్జాతీయంగా చలామణిలో ఉన్న కరెన్సీ అయినప్పటికి అత్యంత విలువైన కరెన్సీల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఉన్న కరెన్సీ ఏది అంటే ఇటీవల ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన నివేధికల ప్రకారం కువైట్ కరెన్సీ అయిన దినార్ అత్యంత విలువైన కరెన్సీగా మొదటి ప్లేస్ లో ఉంది.
ఒక్క కువైట్ దినార్ విలువ ఇండియన్ రుపీస్ లలో రూ. 270.23 గా ఉంది. అలాగే అమెరికన్ డాలర్లలో ఒన్ కువైట్ దినార్ = $ 3.25 గా ఉంది. ఇక రెండో స్థానంలో బహ్రెయినీ దినార్ ఉంది. దీని విలువ ( రూ.220.44 ) గా ఉంది. అలాగే డాలర్ తో పోల్చితే ఒన్ బహ్రెయినీ దినార్ = $2.65 గా ఉంది. మూడో స్థానంలో ఒమినీ రియాల్ ( రూ.215.84 & $2.60 ), జోర్డాడానియన్ దినార్ ( రూ.117.1 & $1.14), జిబ్రాల్టర్ పౌండ్ ( రూ.105.54 & $1.27 ).. ఇవి టాప్ 5 లో అత్యంత విలువ గలిగిన కరెన్సీలుగా ఉన్నాయి. డాలర్ విషయానికొస్తే పదో స్థానంలో ఉండగా మన ఇండియన్ కరెన్సీ 15వ స్థానంలో ఉంది. అయితే కరెన్సీ విలువల్లో ఇప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ టాప్ లో ఉన్న కువైట్ కరెన్సీ విలువలో మార్పు చాలా తక్కువ అని చెబుతున్నారు. 1960 నుంచి కువైట్ దినార్ విలువ స్థిరంగానే ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Also Read:ఛలో నల్గొండ..సమన్వయ కర్తలు వీరే