టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించిన ‘నా సామిరంగ’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. అయినప్పటికీ, మేకర్స్ మాత్రం తమ సినిమా సూపర్ హిట్ అయింది అంటూ ఇంకా హడావుడి చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే’ ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకి ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆస్కార్ అనే పేరే గానీ, సాంగ్ లో మాత్రం బాస్కార్ రేంజ్ అవార్డు క్వాలిటీ మ్యూజిక్ కూడా లేదు.
మొత్తానికి టాలీవుడ్ కింగ్ గా నాగార్జున హిట్ కొట్టి చాలా కాలం అయిపోయింది. మరోవైపు ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నాగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పాతుకు పోతుంది అంటూ ప్రచారం చేశారు. పాపం అమ్మడికి నాగార్జున సినిమా ద్వారా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అన్నట్టు ‘నా సామిరంగ’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం డిస్నీ హాట్ స్టార్ ఫిబ్రవరి 15న ప్రసారం చేయనుందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఈ మూవీలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. అయిన, ‘నా సామిరంగ’ సినిమాకి అటు యూత్ లో గానీ, ఇటు కామెడీ ఇష్టపడే ప్రేక్షక వర్గంలో గానీ ఎలాంటి బజే లేకుండా పోయింది.
పాపం నిజానికి నాగార్జున ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అసలు నాగ్ కి హిట్ వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది. మహేశ్ బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టులో సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. సినిమాలో చాలా ప్రాధాన్యం ఉన్న ఓ పాత్రకి నాగార్జునను తీసుకోనున్నారని టాక్. పోనీలే నాగ్ కి రాజమౌళి సినిమా ద్వారా అయినా హిట్ వస్తుందేమో చూద్దాం.
Also Read:ఎన్టీఆర్ vs బన్నీ.. బిగ్ ఫైట్ ?