INDvsENG : టార్గెట్.. డబుల్ సెంచరీ!

57
- Advertisement -

విశాఖ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ మద్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలో తడబడినప్పటికి యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఓపెనర్స్ గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, జైస్వాల్.. రోహిత్ శర్మ పెవిలియన్ చేరే సమయానికి 40 పరుగులు జోడించారు. రోహిత్ మళ్ళీ నిరాశ పరుస్తూ 14 పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ కూడా (34) తక్కువ పరుగులకే నిష్క్రమించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జైస్వాల్ మాత్రం ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నాడు.

ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన అయ్యర్ (27), కొత్తగా అరంగేట్రం చేసిన పాటిదార్ (32).. వెంటవెంటనే వికెట్లు చేజార్చుకున్నారు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన అక్షర్ పటేల్ (27), శ్రీకర్ భరత్ (17) పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. ఇలా ఓ వైపు వికెట్లు పడుతున్నా జైస్వాల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్స్ ను ధాటిగా ఎదుర్కొంటూ భారీ స్కోర్ కు బాటలు వేశాడు. ప్రస్తుతం 179 పరుగుల వద్ద ఉన్న జైస్వాల్ డబుల్ సెంచరీలో చేరువలో ఉన్నాడు. ఇక జైస్వాల్ కు తోడు మరో ఎండ్ లో అశ్విన్ ఉన్నాడు. ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 93 ఓవర్లలో 336 పరుగుల వద్ద టీమిండియా నిలిచింది. ఇక నేడు జరిగే రెండో రోజు ఆటలో జైస్వాల్ డబుల్ సెంచరీ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

జట్లు:

టీమిండియా : జైస్వాల్, రోహిత్ శర్మ, గిల్, పాటీదార్, అయ్యర్, శ్రీకర్ భరత్, అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లాండ్ ; క్రాలే, బెన్ డకెట్, అలీ పోప్, జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, బెన్ పోక్స్, రెహన్ అహ్మద్, టాం హర్ట్లి, సోయబ్ బషీర్, ఆండర్సన్.

Also Read:

Revanth:త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్

- Advertisement -