చాలామందికి కాళ్లు చేతులు తరచూ తిమ్మిర్లకు గురవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ తిమ్మిర్ల కారణంగా నడవలేని స్థితి కూడా ఏర్పడుతుంది. అయితే తిమ్మిర్లు ఎప్పుడో ఒకసారి రావడం సర్వసాధారణం. కానీ కొందరిలో ఈ సమస్య ప్రతి ఐదు నిమిషాలకోసారి లేదా పది నిమిషాలకోసారి వేధిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్యను ఈజీగా తీసుకోరాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాళ్లు లేదా చేతులు తరచూ తిమ్మిర్లకు గురి కావడం వల్ల శరీరంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉన్నట్లేనట. సాధారణంగా తిమ్మిర్ల సమస్య ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం పోషకాల లోపమే.
ప్రధానంగా విటమిన్ బి, డి, ఐరన్ వంటి పోషకాలు లోపిస్తే తిమ్మిర్ల సమస్య అధికమవుతుంది. ఇంకా కండర సంబంధిత సమస్యలు, ఊబకాయం, డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ తిమ్మిర్ల సమస్య కనిపిస్తోంది. అందువల్ల ఈ సమస్య నుంచి బయటపడడానికి.. పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. యాపిల్, ఆరెంజ్, కివి పండ్లలో విటమిన్ సి తో పాటు బి6 కూడా ఉంటుంది. ఇవి తిమ్మిర్లను తగ్గించి శరీరానికి పోషకాలను అందిస్తాయి. ఇంకా ఐరన్ లోపం ఉన్నవారిలో కూడా తిమ్మిర్ల సమస్య కనిపిస్తుంది. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఎక్కువగా ఉండే బ్రోకలీ, బీన్స్, శనగలు, నువ్వులు వంటి వాటిని ఆహార డైట్ లో చేర్చుకోవాలి.
ఇంకా తిమ్మిర్ల సమస్య తగ్గాలంటే విటమిన్ డి కూడా చాలా అవసరం. ఇందుకోసం ప్రతిరోజు ఉదయం సూర్యోదయంలో ఒక 20 నిమిషాలు ఎండలో నిలబడాలి. డి విటమిన్ లభించే చేపలు, గుడ్డు, పాలు వంటి వాటిని ఆహారంగా తీసుకోవాలి. ఇంకా నారింజ, బాదాం, వేరుశనగ, ఆకుకూరలు.. వంటివి ఎక్కువగా తినాలి. ఎందుకంటే ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం, తిమ్మిర్లను నివారించడంలో సహాయపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు కనీసం 2-3 నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఈ సూచనలు పాటించడం వల్ల తిమ్మిర్ల సమస్యను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:KTR: గ్యాస్ రాయితీ ఉత్త గ్యాస్..కేటీఆర్ సెటైర్