తలైవాకు తమిళ సెగ…భద్రత పెంపు

196
Fringe Tamil Group Opposes Rajini political Entry
- Advertisement -

తమిళనాట సూపర్ స్టార్ గా, రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలుగుతున్న రజనీకాంత్… తాను కూడా తమిళుడినే అంటూ చేసిన కామెంట్ ఇప్పుడు అక్కడ ప్రకంపనలు పుట్టిస్తోంది. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేకెత్తించాయి. అయితే రజనీ రాజకీయాల్లోకి రావద్దని డిమాండ్ చేస్తూ తమిళ భాష, సాంస్కృతిక సంఘాలు, ఇతర కొన్ని తమిళ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వీరంతా రజనీకాంత్ స్థానికతను లేవనెత్తుతున్నారు.

 Fringe Tamil Group Opposes Rajini political Entry
రజనీ రాజకీయల్లోకి రాకూడదంటూ కొద్దిరోజులుగా తమిళ సంఘాలు ఆయన నివాసం ముందు దిష్టిబొమ్మలు తగలబెడుతూ ఆందోళనలు చేస్తున్నాయి. మరోపక్క ఈ వారంలోనే ప్రధాని మోడీతో రజనీ భేటీ కానుండడంతో ముందు జాగ్రత్తగా ఇంటి ముందు భారీ భద్రతను పెంచారు.  మరాఠా మూలాలున్న రజనీకాంత్ కొన్నేళ్లు కర్ణాటకలో కూడా ఉన్నారని వారు అంటున్నారు. రజనీ తమిళుడే కాదని నినదిస్తూ  కోయంబత్తూరులో ఆయన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. రానున్న రోజుల్లో ఈ నిరసనలు మరింత ఎక్కువయ్యే అకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -