కందగడ్డతో ఎన్ని ఉపయోగాలో..!

33
- Advertisement -

మనం ఆరోగ్యంగా ఉండడంలో కూరగాయలు ఆకుకూరలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే సహజ సిద్ధమైన పోషకాలు శరీరానికి పుష్టిని ఇవ్వడంతో పాటు రోగాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇకపోతే ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను మన ఆహార డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటాం. వాటిలో దుంపలు కొంత ప్రత్యేకమైనవి. ఎందుకంటే వీటిని కొందరు ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపరు. దుంపలలో బంగాళాదుంప, చిలకడదుంప, కంద దుంప ఇలా చాలా రకాలు ఉన్నాయి.

అయితే బంగాళాదుంప, చిలకడదుంప వంటి వాటిని తరచూ తింటూ ఉంటాం కానీ కందదుంపను మాత్రం చాలామంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ ఇందులోని పోషకాల గురించి తెలిస్తే తప్పకుండా వీటిని తినడం అలవాటు చేసుకుంటారు. ఈ కందదుంపలో మన శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ ఏ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి కంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా ఈ కంద దుంపను ఆహార డైట్ లో చేర్చుకోవాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇంకా ఇందులో పొటాషియం, ఫైబర్, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.

అందువల్ల కండపుష్టి పెరుగుతుంది. ముఖ్యంగా పురుషుల్లో వీర్యవృద్దిని పెంచే బలవర్ధకమైన ఆహారంగా కందదుంపను పరిగణిస్తారు. ఇంకా ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణశక్తి బలపడుతుందట. డయాబెటిస్ స్థూలకాయం ఉన్నవారు ఆహార డైట్ లో కంద దుంపను చేర్చుకోవడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు ఆహార నిపుణులు. ఇంకా పైల్స్ సమస్య ఉన్నవారు కూడా ప్రతిరోజు కంద దుంప తింటే దివ్య ఔషధంలా పనిచేస్తుందట. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కంద దుంపను ఆహార డైట్ లో చేర్చుకుంటే ఎంతో మంచిది.

Also Read:వెన్నెల కిషోర్..శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

- Advertisement -