తెలంగాణలోని బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి పార్టీ ఆశయాల గురించి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన అమిత్ షా నల్గొండ జిల్లాలోని తెరట్ పల్లి గ్రామంలో పర్యటించారు. మావోయిస్టుల చేతిలో హతమైన మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్టీ కోసం మైసయ్య ప్రాణాలు విడిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం అమిత్ షా బూత్ స్థాయి కార్యకర్తలో సమావేశం నిర్వహించారు
భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని అమిత్ షా అన్నారు. బీజేపీకి 11కోట్ల మంది సభ్యులు ఉన్నారని, 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని అన్నారు. బూత్, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ఒకే వేదికపైకి రావటం అరుదైన విషయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు.
అంతకముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకి పార్టీ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్ ఘనస్వాగతం విమానాశ్రయం నుంచి నేరుగా నల్గొండ జిల్లా చుండూరు మండలం తెరటుపల్లి రోడ్డు మార్గంలో ఆయన పయనమయ్యారు.