ఎట్టకేలకు.. ఫామ్ లోకి ప్లాప్ హీరో

16
- Advertisement -

బాలీవుడ్‌ లో బాబీ డియోల్ కి ఒకప్పుడు విలువ లేదు. అలనాటి స్టార్ హీరో ధర్మేంద్ర చిన్న కుమారుడిగా గుర్తింపు తప్ప, సరైన విజయం మాత్రం బాబీ డియోల్ కి దక్కలేదు. నిజానికి 1977లో రిలీజ్ అయిన ‘ధరమ్ వీర్’ అనే హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు బాబీ డియోల్. ఆ తర్వాత, బాబీ డియోల్ ‘బర్సాత్’ సినిమాతో తన మొదటి ప్రధాన పాత్రను పోషించాడు. అరంగేట్రంలోనే ఆ సినిమా బాబీ డియోల్ కి ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఐతే, హీరోగా మాత్రం బాబీ డియోల్ సక్సెస్ కాలేకపోయాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.

యానిమల్ లో విలన్ పాత్రను పోషించి ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాబీ డియోల్ డేట్స్ కోసం ఇటు సౌత్ ఇండస్ట్రీ కూడా పోటీ పడుతుంది. ఇప్పటికే, కోలీవుడ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కంగువా. దర్శకుడు శివ ఈ సినిమాను పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ మూవీలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్ లుక్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. ఆ లుక్ విపరీతంగా వైరల్ అయ్యింది. పైగా ఆ లుక్ లో బాబీ డియోల్ భయంకరంగా ఉన్నాడు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇప్పుడు, బాబీ డియోల్ మరో సౌత్ సినిమాలో నటించబోతున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK109 సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ మూవీలో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. పైగా బాబీ డియోల్ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందట. మొత్తానికి ప్లాప్ హీరోకి ఎన్నో ఏళ్ల తర్వాత కాలం కలిసి వచ్చింది.

Also Read:ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు రిలీఫ్

- Advertisement -