Harishrao:స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌దే గెలుపు

23
- Advertisement -

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీల్లో 6 చోట్ల మనమే గెలిచాం. స్వల్పఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయారన్నారు. కాంగ్రెస్ బడ్జెట్ లేకపోయినా అబద్ధాలు ప్రచారం చేసి గెలిచింది. హామీలను అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తోందన్నారు.ప్రశ్నిస్తే దాడులు చేస్తూ, కేసులు పెడుతోందన్నారు.

కేసీఆర్ మంజూరు చేసిన అభివృద్ధి పనులను అడ్డుకుంటూ నిధులను వాపసు పంపుతున్నారన్నారు. రైతుబంధు 15 వేలు, ఉచిత కరెంట్, 2 లక్షల రైతు రుణమాఫీ, పింఛన్ 4 వేలు, వడ్లకు బోనస్, అక్కచెల్లెళ్లకు 2500 హామీల్లో ఏదీ అమలు కాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

రైతుల మోటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, మోటార్ల వైండింగ్ వ్యాపారం, జనరేటర్ల వ్యాపారం పెరగడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు సీఎం కుర్చీ కేసీఆర్ బెట్టిన భిక్ష. పదవి వస్తే బాధ్యత పెరగాలి. కానీ రేవంత్ సీఎం పదవిని కించపరుస్తున్నారని…ఆరు నెలల దాటితే స్థానిక ఎన్నికలు వస్తాయి. ప్రజలే మనల్ని వెతుక్కుని మరీ ఓటు వేస్తారన్నారు.కార్యకర్తలు అధైర్యపడొద్దు. భవిష్యత్తు మనదే. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది. మెదక్‌లో గులాబీ జెండా ఎగురుతుందన్నారు.

Also Read:చర్మ సమస్యలకు వీటితో చెక్..

- Advertisement -