ఆటగాళ్లు నెలకొల్పే వ్యక్తిగత రికార్డ్స్ పట్ల టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్ కాస్ట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హిట్ మ్యాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆటగాళ్లేవ్వరు వ్యక్తిగత రికార్డ్స్ కోసం ఆడడం జట్టుకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పుకొచ్చాడు. తాను కెప్టెన్ అయిన తరువాత జట్టులో మార్పు తీసుకోచ్చేందుకే ప్రయత్నించినట్లు వ్యాఖ్యానించాడు. 2019 వరల్డ్ కప్ లో తను 5 సెంచరీలు చేశానని అయినప్పటికీ ఓటమి మూటగట్టుకున్నామని చెప్పుకొచ్చాడు.
అందుకే వ్యక్తిగత రికార్డ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రతి ఆటగాడు జట్టు విజయం కోసమే కృషి చేయాలని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా వ్యక్తిగత మైలు రాళ్ళ కోసం కాకుండా ఫ్రీగా ఆడుతున్నారని ప్రశంసించాడు. ఇక మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా బాద్యత వహించడం కాస్త కష్టమైన పనేనని, అయినప్పటికీ ఈ బాధ్యత ఎంతో గౌరవాన్ని స్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో కప్ వేటలో టీమిండియా పటిష్టంగా ఉంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ను తృటిలో చేజార్చుకున్న రోహిత్ సేన.. పొట్టి కప్పు ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే పట్టుదలతో ఉంది. కాగా టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు క్రీడా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read:మెంతినీరు త్రాగితే ఎన్ని లాభాలో..!