TTD:తిరుమలలో స‌నాత‌న ధార్మిక సదస్సు

21
- Advertisement -

తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని జేఈవో స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో సోమ‌వారం జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన ప‌త్రిక‌లు, ధార్మిక కార్య‌క్ర‌మాల‌పై బుక్ లెట్ రూపొందించాలని డిపిపి అధికారులను ఆదేశించారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా స‌దుపాయాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిర్వ‌హించే ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌పై వీడియో రూపొందించాల‌ని ఎస్వీబీసి సిఈవోను ఆదేశించారు. స‌నాత‌న ధార్మిక సదస్సును ఘ‌నంగా నిర్వ‌హించేందుకు లైజ‌న్, నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించాల‌న్నారు.

Also Read:రూ.200 కోట్లు దాటిన హను-మాన్

- Advertisement -