షర్మిల యాక్షన్ ప్లాన్.. షురూ ?

24
- Advertisement -

ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షర్మిల.. ఏపీ రాజకీయాలపై యాక్షన్ ప్లాన్ షురూ చేయబోతున్నారా ? తన వ్యూహాల్లో మెయిన్ టార్గెట్ తాజా అన్న జగనేనా ? ఇతర పార్టీలపై షర్మిల వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది ? ఇలాంటి ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఈ నెల 21న ( రేపు ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత నుంచి ఆమె వేసే ఒక్కో అడుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు దారి తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తన అన్న జగన్ పాలనపై షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతున్న అంశం.

ముఖ్యంగా గత ఎన్నికల ముందు హత్య గావించబడ్డ వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీపై అడపా దడపా జగన్ సర్కార్ పై పరోక్షంగా వేలెత్తి చూపిస్తూ వచ్చారు వైఎస్ షర్మిల.. ఇక ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వివేకా హత్య విషయంలో షర్మిల ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ఏపీ రాజకీయాల్లో సంచలనమే. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ కు షర్మిల పంటికింద రాయిలా మారే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన వేళ.. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ రేస్ లో నిలవాలంటే ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అలా చూస్తే టీడీపీ జనసేన కూటమిలో కలిసేందుకు షర్మిల సిద్దమౌతారా ? లేదా హస్తం పార్టీని సింగిల్ గానే పరిలోకి దించుతారా ? అనేది చూడాలి అలాగే షర్మిల పోటీ చేసే స్థానంపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి మొత్తానికి షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయనే చెప్పాలి. మరి షర్మిల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్

- Advertisement -