TTD:రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై రివ్యూ

25
- Advertisement -

తిరుమలలో జనవరి 25న జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో(ఎఫ్‌ఏసి) శ్రీ వీరబ్రహ్మం శుక్రవారం సాయంత్రం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటి కనుక అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదేవిధంగా టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలని చీఫ్‌ పీఆర్‌వో డా. టి.రవిని ఆదేశించారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు.

కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ 30 నుండి 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. జనవరి 25వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు.

Also Read:అరటిపండు అతిగా తింటే ప్రమాదమే!

- Advertisement -