మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పలాస 1978, శ్రీ దేవి సోడా సెంటర్ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘మట్కా’ చిత్రంతో పాన్-ఇండియన్ అరంగేట్రం చేస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మట్కా హై బడ్జెట్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో బిగ్ కాన్వాస్‌పై రూపొందుతోంది.
వరుణ్ తేజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మట్కా ప్రిమైజ్ ని చూపించడానికి ఓపెనింగ్ బ్రాకెట్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. కథానాయకుడు గ్రామోఫోన్‌లో మ్యూజిక్ ని ప్లే చేయడంతో ఇది ఓపెన్ అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్‌లైన్‌లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. కథానాయకుడు చైల్డ్ వుడ్ పోర్షన్ లో కబడ్డీ ఆడుతూకనిపించారు. అతను గ్యాంబ్లింగ్ మాఫియాకు అధిపతిగా ఎదుగుతాడు. సిగార్ తాగుతూ ఎవరికో ఫోన్‌లో ‘ప్రామిస్’ అనడం ఆసక్తికరంగా వుంది.
క్లిప్‌లో వరుణ్ తేజ్‌ని పూర్తిగా చూపించనప్పటికీ, చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను పోషించడానికి అతను పూర్తిగా మేకోవర్ చేసుకున్నట్లు అర్థమైంది. అతని డ్రెస్సింగ్ 80ల నాటి ఫ్యాషన్ స్టయిల్ ని పోలి వుంది. వరుణ్ తన హావభావాలు, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇంటెన్స్ ని తీసుకొచ్చారు. ‘ప్రామిస్’ అనే డైలాగ్ బలమైన ప్రభావాన్ని చూపుతుంది.
1958, 1982 మధ్య జరిగే కథ కాబట్టి, 50ల నుండి 80ల వరకు ఉన్న వాతావరణాన్ని రీక్రియేట్ చేయడంలో దర్శకుడు కరుణ కుమార్ విజయం సాధించారు. సినిమాటోగ్రాఫర్ ఎ కిషోర్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ తేజ పులాల సమిష్టి కృషి వింటేజ్ వైబ్స్‌ని తీసుకొచ్చింది. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తం మీద, ఓపెనింగ్ బ్రాకెట్ క్యురియాసిటీని పెంచింది.
యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా మట్కా కథను రూపొందించారు. 24 ఏళ్లుగా సాగే కథతో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, సురేష్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రంలో మల్టిపుల్ యాక్షన్ సన్నివేశాలను వుంటాయి. వీటిని నలుగురు ఫైట్ మాస్టర్‌లు పర్యవేక్షిస్తారు.మట్కా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read:కాంగ్రెస్‌కు షాక్..సోనియాకు కరెంటు బిల్లులు పోస్ట్