- Advertisement -
రామ్ చరణ్ నటించిన రచ్చ చిత్రంలోని టైటిల్ సాంగ్ లో తన స్టెప్పులతో మత్తెక్కించిన లీసా హేడెన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు సరిగ్గా ఏడాది క్రితం తన ప్రియుడు డినో లల్వానీని వివాహం చేసుకుంది. ఇటీవల తాను 8 నెలల గర్భవతిని అంటూ కొన్ని ఫోటోలు పోస్ట్ చేసిన లీసా తాజాగా ఓ పండంటి బిడ్డకు జన్మించింది. లీసా-డినో దంపతులకు మగబిడ్డ జన్మించగా, ఆ బేబి బాయ్ కి జాక్ లల్వానీ హేడెన్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు ఈ దంపతులు. తన వ్యక్తిగత విషయాలను పంచుకునే లీసా.. గర్బం ధరించిన తరువాత కూడా బేబి బంప్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. లీసా.. క్వీన్, యే దీల్ ముష్కిల్ సినిమాలో నటించింది.
- Advertisement -