ప్రీమియర్ కలెక్షన్స్ లో ‘హను మాన్’ ప్రభంజనం

95
- Advertisement -

హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘హను మాన్’. ఈరోజు విడుదలైన ఈ చిత్రానికి ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు. వాటికి ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక, అమెరికాలో కేవలం ప్రీమియర్ షోలతోనే 250 వేల డాలర్స్‌కు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. దీంతో త్వరలోనే 1 మిలియన్ మార్క్ దాటనుందని టాక్. మొత్తానికి భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది.

ఇక, ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ గురించి క్లారిటీ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. హ‌ను మాన్ డిజిట‌ల్ రైట్స్ జీ5 సొంతం చేసుకోగా, శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. మొత్తమ్మీద ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ‘హనుమాన్ మూవీ ఫస్ట్ హాఫ్ మెంటల్ మాస్. పక్కా బ్లాక్ బస్టర్’, ‘ఇంటర్వెల్ షాట్ జై శ్రీరామ్. విజువల్ షాట్స్‌కు ఆడియెన్స్ రెస్పాన్స్ మాములుగా లేదు’, ‘హనుమాన్ సినిమా చివరి 20 నిమిషాలు గూస్ బంప్స్’ అంటూ యూజర్లు ట్వీట్స్ చేస్తున్నారు.

ఓవరాల్ గా భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన హ‌ను మాన్ సినిమా.. మహేష్ బాబు గుంటూరు కారం కంటే కూడా సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో కూడా హ‌ను మాన్ కు మంచి రెస్పాన్స్ ద‌క్కుతుంది. హనుమాన్ క్లైమాక్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉండటం ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్.

Also Read:కే‌సి‌ఆర్ ఎంట్రీ.. కాంగ్రెస్ కు సినిమా స్టార్ట్?

- Advertisement -