తెలంగాణలో బిఆర్‌ఎస్ ఓటమి అనూహ్య పరిణామమే. గత పదేళ్ళ కాలం రాష్ట్రాన్ని ఆగ్రపాతంలో నిలిపిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. అభివృద్ది, సంక్షేమం సమపాళ్ళలో అందిస్తూ కేసిఆర్ సాగించిన పాలన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలంగాణ వైపు చూసేలా చేసింది. అయితే ‘నిజం ఇల్లు దాటే లోపు అబద్దం ఊరంతా చుట్టేస్తుంది’.. అన్నట్లుగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చేసిన అబద్దాల కారణంగా ప్రజలు బిఆర్‌ఎస్ ను తిరస్కరించారు. ఇదే అంశం పై తాజాగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారం కారణంగానే ప్రజలు బిఆర్‌ఎస్ కాదని, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారాని అన్నారు. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేశారు కానీ తొమ్మిదిన్నర ఏళ్లలో 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కేటిఆర్ చెప్పుకొచ్చారు.
Also Read:‘గుంటూరుకారం’ హిట్ అవ్వాలంటే?
దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు , ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చిన ఘనత బిఆర్‌ఎస్ దే.. 25 లక్షల పెన్షన్లను 45 లక్షలకు పెంచిన ఘనత కూడా బిఆర్‌ఎస్ దే.. కానీ ఇవేవీ ఏనాడూ ప్రచారం చేసుకోలేదు. అందుకే కాంగ్రెస్ పలికిన అబద్దాల ముందు బిఆర్‌ఎస్ అభివృద్ది ఓడిపోయిందని కేటిఆర్ వ్యాఖ్యానించారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళమని, రాజకీయ ప్రచారం గురించి ఏనాడూ ఆలోచించలేదని, కేవలం అభివృద్ధి లక్ష్యంగా పని చేశామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేసిన అభివృద్దిని బలంగా ప్రచారం చేసి ఉంటే బిఆర్‌ఎస్ పార్టీ కనీ విని ఎరుగని రీతిలో విజయం సాధించేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
https://x.com/BRSparty/status/1745349459016630779?s=20