శ్రుతి హాసన్ ప్రధాన పాత్రగా తమిళంలో ‘సంఘమిత్ర’ సినిమా తెరకెక్కుతోంది. 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమానికి సంబంధించిన ఫస్టు లుక్ పోస్టర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో లాంచ్ చేశారు.ఇక ‘సంఘమిత్ర’ అనే తమిళ్ సినిమా గురించి ఇప్పుడు అందరు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
బాహుబలి తరవాత ఇంత భారీ బడ్జెట్ సినిమాను సౌత్ లో తీస్తుంది ఇదే. ఫస్ట్ లుక్ లో యుద్దానికి సిద్దమైన యోధురాలుగా గుర్రంపై శృతిహాసన్ లుక్ సినిమా పై అంచనాలను పెంచే విధంగా ఉంది. కాని ఇది కేవలం ఆర్ట్ వర్క అంతే. కాకపోతే ఇప్పుడు టాపిక్ సినిమా మేకింగ్ కాదు శృతిహాసన్ మార్కెట్ విలువ, ఆమె నటనా ప్రతిభ గురించి.
ఇప్పటివరకు కెరీర్లో శృతిహాసన్ చేసిన గొప్ప పాత్రలు అయితే ఏమి లేవు. బాగా ఎమోషన్ ఉన్న సినిమా అంటే అది ధనుష్ తో చేసిన ‘3’. ఇంకా బాలీవుడ్లో కూడా డి-డే అనే సినిమాతో కాస్త తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సినిమా మొత్తాన్ని తన నటనాకౌశల్యం తో మెప్పించింది ఇంతవరుకు లేదు. ఇప్పుడు శృతిహాసన్ ఎదుర్కుంటున్న పెద్ద విమర్శ ఇదే. ఒక సాధారణ కమర్షియల్ హీరోయిన్ పై ఇంత నమ్మకంగా భారీ బడ్జెట్ ప్రాజెక్టును చేయడానికి సిద్ధపడ్డ మేకర్స్ ధైర్యాన్ని గ్రేటే అనాలి.
ఈ ప్రాజెక్టులోకి శృతిహాసన్ ను తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమెకు తెలుగు – తమిళ్ – హిందీ లో మార్కెట్ ఉండటమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. శృతిహాసన్ కూడా సంఘమిత్ర పాత్ర కోసం లండన్ వెళ్లి కత్తియుద్ధం గుర్రపుస్వారి లాంటివి నేర్చుకుంది. ఈ సినిమా ఆమె సినీ ప్రయాణం లో గొప్ప స్టేజి అనే చెప్పాలి.
సంగీతం డాన్స్ నటన ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన శృతి ఇప్పుడు ఈ వీరోచిత సినిమాతో మరో అడుగు ముందుకి వేసింది అని చెప్పవచ్చు. శ్రుతి హాసన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఇది ఆమె స్థాయిని మరింతగా పెంచే చిత్రమవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.