నాకు సమంతలో అదే నచ్చదు: చైతూ

235
Naga Chaitanya wants privacy in social media
- Advertisement -

సమంత, నాగచైతన్య..ఈ జంట గురించి ఏదో ఒక న్యూస్‌ సోషల్ మీడియాలో హల్చల్‌ చేస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఈ లవ్‌ బర్డ్స్‌ ఎంగేజ్‌మెంట్‌ కూడా పూర్తైపోయింది. ఇక సామ్‌ మెడలో చైతూ మూడుముళ్ళు వేయడమే ఆలస్యం. ఇప్పటికే ఛాన్స్ దొరికినప్పుడల్లా..చెట్టాపట్టాలేసుకొని తిరిగే  ఈ జంటని చూసి..అసలైన ప్రేమికులంటే వీరే అనే పేరు కూడా కొట్టేశారు.

 Naga Chaitanya wants privacy in social media

ఇక లవర్స్‌ మద్య జరిగే కొన్ని సంఘటన వల్ల..  ఏదో ఒక విషయంలో అడ్జెస్ట్‌ అవ్వక తప్పదు అనే భావన ఎవరోఒకరికి కలుగుతుంది. అయితే ఇప్పుడు చైతూకి కూడా అదే పరిస్థితి ఎదురైందట. ఇన్నాళ్ళూ కాబోయే భార్య సమంతలో చాలా విషయాలు తనకు నచ్చుతాయని చెప్పిన చైతూ, ఒక విషయం మాత్రం అస్సలు నచ్చదని అంటున్నాడు. అదే ప్రైవసీ.

ప్రైవసీ అంటే..వీరిద్దరి మధ్యకాదులెండి..సోషల్‌ మీడియాలో. అవును…అసలు సమంతకి సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది చెప్పాలో,ఏది చెప్పకూడదో తెలీదని, ఈ క్వాలీటీయే తనకు  నచ్చట్లేదన్నాడు చైతూ. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఏది సీక్రెట్ గా ఉంచాలో సమంతకు అస్సలు తెలియదని, తామిద్దరు కలిసిన ప్రతిసారి ఏదో ఒక ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుందని, అది తనకు అస్సలు నచ్చదని అంటున్నాడు చైతూ.
Naga Chaitanya wants privacy in social media
నిజానికి.. తనకు సమంతకు మధ్య జరిగే విషయాలు, ఫొటోలు మీడియాలోకి రావడం తనకు అస్సలు ఇష్టముండదని.. కానీ సమంత మాత్రం పెళ్లికి ముందు దొరికిన ఈ టైమ్ ను చక్కగా ఎంజాయ్ చేస్తోందని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఇక సామ్‌ అలా ఎంజాయ్‌ చెయ్యడం కోసం ఈ ఒక్క విషయంలో తను ఎడ్జెస్ట్ అయిపోతున్నానని కూడా అన్నాడు.

ఇదిలాఉంటే..అక్టోబర్ లో పెళ్లి చేసుకోవాలని భావిస్తోందట ఈ జంట. పెళ్లికి గోవాను వేదికగా ఫిక్స్‌ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుకే ఆ సినిమాల్ని వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇక వీళ్ల పెళ్లి తేదీని అధికారికంగా ఆగస్ట్ లో ప్రకటించే ఛాన్స్ ఉంది.

- Advertisement -