ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ముంగిట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చిక్కుల్లో పడేటట్లు కనిపిస్తున్నాడు. అంతర్జాతీయ పిచ్ లను ఉద్దేశించి ఐసీసీ, మరియు మ్యాచ్ రిఫరీలపై హీట్ మ్యాన్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సౌతాఫ్రికా తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే.. ” విదేశీ పిచ్ లపై ఆడేటప్పుడు తమ జట్టుకు ఎలాంటి ఇబ్బందులు లేవని, కానీ విదేశీ జట్లు భారత్ పిచ్ లపై ఆడినప్పుడు మూడు రోజుల్లో ఆట ముగిస్తే.. ఇవేం పిచ్ లు, చెత్త అంటూ నోరు పారేసుకోవడం ఆపితే మంచిది.” అని ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్ కామెంట్స్ చేశాడు.
దీంతో ఐసీసీ యాజమాన్యంపై రోహిత్ శర్మ కించపరిచేలా మాట్లాడారని చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమైనట్లు క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనుక నిజం అయితే రోహిత్ శర్మ పై వేటు పడే అవకాశం ఉంది. ఇ ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు టీమిండియాను గట్టిగా దెబ్బ తీసే అవకాశం ఉంది. మరి నిజంగానే రోహిత్ శర్మ పై చర్యలకు ఐసీసీ సిద్దమౌతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ నెల 11 నుంచి అఫ్గానిస్తాన్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. వరల్డ్ కప్ కు ముందు ఆడుతున్న చివరి అంతర్జాతీయ సిరీస్ కావడంతో ఈ సిరీస్ ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ సిరీస్ తో గత కొన్నాళ్లుగా టీ20 లకు దూరంగా ఉంటూ వస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
Also Read:TTD:నడకమార్గాల్లో భక్తుల రక్షణకు చర్యలు