నా సామిరంగ ..ట్రైలర్ డేట్ ఫిక్స్

29
- Advertisement -

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లు, ఫస్ట్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ నా సామిరంగ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. జనవరి 9న ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కత్తి పట్టుకొని మ్యాసీ లుక్ కనిపించారు నాగార్జున.మంచి ప్రేమకథ, స్నేహం, భావోద్వేగాలు, మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన నా సామిరంగ సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ.

ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. శివేంద్ర దాశరధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
నా సామిరంగ జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది.

Also Read:వెంకీ, నాగ్.. హిట్ కొట్టేనా?

- Advertisement -