నెల రోజుల్లోనే ఆరుసార్లు.. ఛలో ఢిల్లీ!

35
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పాలన అంతా కూడా ఢిల్లీ కేంద్రంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సి‌ఎం రేవంత్ రెడ్డి తరచూ డిల్లీ ప్రయాణమే ఇందుకు కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే ఐదు సార్లు హస్తిన బాటా పట్టారు సి‌ఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 6, 8, 19, 26, జనవరి 4 తేదీల్లో ఆయన ఢిల్లీ ప్రయాణాలు సాగాయి. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న డిల్లీ పెద్దల అనుమతి తప్పనిసరిగా మరిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం రేవంత్ రెడ్డికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి ఆ స్వేచ్ఛ లేనట్లే కనిపిస్తోంది. నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న, మంత్రివర్గ విస్తరణ చేయాలన్న, హామీల అమలు చేపట్టాలన్న, ఇలా ప్రతి దానికి కూడా డిల్లీ పెద్దల అనుమతి లేనిదే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందనేది కొందరి అభిప్రాయం.

ఈ నేపథ్యంలో కేవలం నెల రోజుల్లోనే ఐదు సార్లు హస్తిన బాట పడితే రాబోయే రోజుల్లో పూర్తిగా ఢిల్లీ కేంద్రంగా పాలన సాగిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి నామమాత్రపు సి‌ఎం యేనా అనే డౌట్స్ కూడా మొదలౌతున్నాయి. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీల విషయంలో ఎదురవుతున్న ఆటంకాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర పాలన సాగితే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందనే భయం కూడా మొదలైంది. రేవంత్ రెడ్డి సి‌ఎం పదవి చేపట్టిన మొదట్లోనే ఆయనకు పూర్తి అధికారం లేదని, ఏ విషయమైన పార్టీ అధిష్టానంతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అగ్రనేతలు గతంలోనే స్పష్టం చేశారు. దీన్ని బట్టి ప్రస్తుత పరిణామాలు చూస్తే అధికారం ఇక్కడున్న అమలు మాత్రం డిల్లీ కేంద్రంగానే జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది.

Also Read:‘ఫ్యాటీలివర్’తో ప్రాణాలకే ముప్పు!

- Advertisement -