బాలయ్యతో రాజశేఖర్ కామెడీ

278
- Advertisement -

టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ, బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం, డైరెక్టర్ బాబీ, బాలయ్య సినిమా పై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇన్ డైరెక్ట్ గా ఓ క్లూ ఇచ్చాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మరో సీనియర్ హీరో కూడా కనిపించబోతున్నాడని టాక్. మరి ఎవరు ఆ హీరో ?, సీనియర్ హీరో రాజశేఖర్ అట, రాజశేఖర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య ఎలాగూ యాక్షన్ కాబట్టి.. రాజశేఖర్ చేత ఫుల్ కామెడీ చేయించాలని డైరెక్టర్ బాబీ ప్లాన్ వేశాడట.

రాజశేఖర్ లో గొప్ప కామెడీ టైమింగ్ ఏమీ ఉండదు. మరి ఏ కామెడీ టైమింగ్ లేని రాజశేఖర్ చేత ఎలాంటి కామెడీని పుట్టిస్తారో చూడాలి. డైరెక్టర్ బాబీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నాము. వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ బాబీ – బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న డైరెక్టర్ బాబీ కి ఫుల్ డిమాండ్ ఉంది. మరోపక్క ‘భగవంత్ కేసరి’తో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బాబు కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి ‘భగవంత్ కేసరి’ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు. ఇటు హీరో రాజశేఖర్ కూడా క్యారెక్టర్స్ చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు.

Also Read:ఎన్టీఆర్ తో మళ్లీ రాజమౌళి

- Advertisement -